అందులో అందరు చనిపోగా ఇద్దరు మాత్రమే మిగిలిరి. ఈ ఇరువురికి చిన్న వయసులోనే (అంటే పది) పది సంవత్సరాల వయస్సులోనే పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రాంతాల్లో ప్లేగు / కలరా వ్యాపించడంతో ఈ ఇద్దరు యువకులు వారి తల్లిదండ్రులతో పాటు ప్లేగు / కలరా కారణంగా మరణించారు,  ఇప్పుడు బిజ్జినపల్లి గృహాన్ని నడుపుతున్న ఇద్దరు యువ వితంతువులు మిగిలారు.

 

ఈ యువ వితంతువులు వయసు మీద పడే సరికి, ఒక సరైన వారసుణ్ణి దత్తతకు కోరిరి, ఐతే దీనికి సరైన వారసుడు తాడూరులో ఉన్న రామా రెడ్డి అని తలచి, ఈ విషయాన్ని నిజాము ప్రభువులకు కూడా చెప్పి సులభంగా ఒప్పించవచ్చని అనుకొనిరి. దీన్తో తాడూరు వారికి సందేశం పంపగా వారు దానిని నిరాకరించిరి.

 

ఈ బిజ్జనపల్లి వితంతువులు ఆ బాలుడిని అపహరించి తలచిరి. అక్కడ ఉన్న నిఘా వారికి లంచం ఇచ్చి నిద్రిస్తున్న ఈ బాబును కోట దాటించిరి. ఈ రకంగా రామకృష్ణా రెడ్డి ని తాడూరుకు యాభై మల్ల దూరంలో ఉన్న బిజ్జనపల్లికి తెచ్చిరి. ఆ రాత్రికే ఆ బాలుడికి వివాహం చేసి, దత్తత తీసుకునే కార్యక్రమాలు కూడా ముగించిరి. దీన్తో వీరిరువురి మధ్య యుద్ధం జరిగి చాలా మంది చనిపోయిరి, కానీ సమస్య పరిస్కారం కాలేదు.

 

ఈ రకంగా రామకృష్ణా రెడ్డి గారికి అక్కడే పెరిగి, పెద్దవాడై విద్యా బుద్ధులు కూడా నేర్పిరి ఆ వితంతువులు. పెరిగి పెద్దవాడైన తరువాత కొంత కాలానికి తన తమ్ముడిని చూడడానికి తాడూరుకి వెళ్ళాడు, అక్కడ తన చిన్న తమ్ముడు వయసులో చాలా చిన్నవాడు కావడం వల్ల మరియు తల్లి కి కూడా వయసు మళ్లినది కాబాట్టి వారి ఆస్తిని కూడా కాపాడి చివరకు రెండు కుటుంబాలను ఒకటి చేస్తాడు.   

 

రామకృష్ణా రెడ్డి ని పెంచిన తల్లి మంగమ్మ మంచి తెలివైన పాలకురాలు. మొత్తం బిజినాపల్లి వ్యవహారాలన్నీ చూసెడిది. ఆ నాటికి ఆ ఎస్టేటు లో ఇరవై ఐదు గ్రామాలు ఉండేడివి. ఈ మంగమ్మ తర్వాతి వితంతువు కిష్టమ్మ చాలా నిధానస్థురాలు కాబట్టీ అక్కను అనుసరిస్తుండేది.

 

రామకృష్ణా రెడ్డి కి రామ లక్ష్మమ్మతో వివాహం జరిగింది. ఈమె చాలా ధనిక కుటుంభం నుడి వచ్చింది. వచ్చేటప్పుడు చాలా బంగారు తెచ్చింది. ఈమె తన ఇద్దరు అత్తలను మంచిగా చూసుకొనెను. ఈ అమ్మాయి చాలా చురుకైనది కూడా. తను గర్భవతి అయినప్పుడు తనకు కొబ్బరి, బెల్లం తినాలనిపించి తెప్పించుకునేది. కానీ అత్త మంగమ్మకు నచ్చక వద్దని చెప్తుంది. కానీ ఒక భటుని చేతా ప్రతిరోజు బంగారు నాణాలు ఇచ్చి దొంగ చాటుగా ఈమె వాటిని తెప్పించుకొని తినేది.

 

ఆలా చాలా కాలం పాటు జరిగిన తరువాత ఒక రోజు కొత్తగా పనిలో చేరిన తోటమాలి ఆ బటున్ని పట్టిస్తాడు. విషయం తెలిసిన మంగమ్మ మిరపకాయలు కాల్చి ఉంచి కోడలిని ఒక గదిలో బంధిస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే వెళ్లి చూడగా ఆమె చనిపోయి ఉంటుంది.

 

ఈ విషయం నుచి తేరుకోవడానికి రామకృష్ణా రెడ్డి కి చాలా సమయం పడుతుంది. తన పిన తల్లి మంగమ్మ చాలా శక్తివంతురాలు కాబట్టి అతను ప్రశ్నించలేకపోతాడు. రామకృష్ణా రెడ్డి కి జానకమ్మ నిచ్చి మరో వివాహం చేసిరి. ఈమెకు మొదట ఐదుగురు సంతానం కల్గి పుట్టిన వారు పుట్టినట్లుగానే చనిపోతారు. దీన్తో అత్తగారి చేతిలో చనిపోయిన రామకృష్ణా రెడ్డి గారి మొదటి భార్య (రామలక్ష్మామ్మ) దయ్యంగా మారి వీరిని చంపిందని భయం పుట్టుకుంటుంది. ఈ దయ్యం బిజ్జనపల్లి వారికి చాలా రకాల ఇబ్బందులను కల్గించిందని అనుకుంటారు.

 

రామాకృష్ణా రెడ్డి మళ్ళీ ఒక పన్నెడు సంవత్సరాల అందమైన యువతీ జగ్గమ్మను వివాహమాడిరి. దయ్యం భయంతో తనకు పుట్టిన సంతానం మరణించడంతో ఇలా చేసిరి.

 

అప్పుడు జానకమ్మ ఆ దయ్యంతో తలపడి, దానిని ప్రాధేయపడుతుంది, తనకు సంతానం లేకుండా చేయొద్దని వేడుకోగా, దయ్యం ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు తన జ్ఞపకార్థం రామలక్ష్మమ్మ అని పేరు పెట్టమని చెప్పింది.

 

తర్వాత జానకమ్మ ఒక ఆడబిడ్డకు జన్మ నిచ్చింది. ఆ బిడ్డపేరు రామలక్ష్మమ్మ అని చనిపోయిన తన కోడలు పేరును నిర్ణయించిరి. ఈ ఆడబిడ్డ రామలక్ష్మమ్మ నే మా నాయనమ్మ. తర్వాత జానకమ్మ మరో ఇద్దరు ఆడపిల్లకు, ఒక బాలుడికి జన్మ నిచ్చింది. మరియు జగ్గమ్మ ఐదుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్ల కు జన్మనిచ్చింది. దీన్తో ఆ రామలక్ష్మమ్మ(దయ్యం) గారి ఆశీస్సులతో బిజ్జనపల్లి సంస్థానంలో పిల్లల కోలాహలం మొదలయింది.

తర్వాత ఆ కుటుంబం చనిపోయిన రామలక్ష్మమ్మ విగ్రహాన్ని తయారు చేయించి తమ పూజా గదిలో ఉంచి ప్రతిరోజు పూజలందించిరి. తర్వాత మొదటి ఇద్దరు ఆడబిడ్డలకు పెద్ద రామలక్ష్మమ్మ (మా తాతగారైన జాగీరుదారు వెంకట నరసింహా రెడ్డి, పల్లెపాడు గారి భార్య) మరియు చిన్న రామలక్ష్మమ్మ (మా చిన్నాన్న ధర్మారెడ్డి గారి తల్లి/ పల్లెపాడు అనంత రెడ్డి గారి భార్య) తర్వాత వారు పల్లెపాడు రామ చంద్రమ్మ గా పేరు మార్చుకొనిరి. 

  ముందు పేజి

తర్వాతి పేజి

 































































back       began       home       next                         
 line
address