మా నాయనమ్మ రామలక్ష్మీ దేవమ్మ కుటుంబ చరిత్ర : భిజ్జినపల్లి రెడ్డి వంశం:

 

తండ్రి -  శ్రీ రామ కృష్ణా రెడ్డి గారు.   తాత  -  శ్రీ రామా రెడ్డి గారు.

రామ రెడ్డి గారికి నలుగురు భార్యలు, వీరిలో ఒకరికి మాత్రమే ఒక కూతురు పుట్టెను. వీరిక్లి పుత్ర సంతానం లేదు. రామా రెడ్డి గారు తన నివాసం తాడూరు కేంద్రంగా కల్గి 32 గ్రామాల దేశ్ముఖీ  (ఫ్యూడల్ లార్డ్) గా చేసిరి. ఇతను చెప్పులకు బంగారు తొడుగులు, తనకు ప్రత్యేకంగా తేనీరు కొనుటకు మనుషులను మహారాష్ట్రం లోని పూణే ప్రాంతానికి పంపించేవారు. ఈ రకంగా ఆయన చాలా డాంబికంగా బ్రతికేవారు. తనను కలవడానికి వచ్చినవారికి కూడా గొప్ప మర్యాదలు చేసేవారు. ఇతనికి సంగీత, నాట్యాల పై మక్కువ ఎక్కువ. ఇతని అతిథులు చాలా సంతోషించెడివారు. ఆ రోజుల్లోనే చాలా పెద్ద మందిరం నిర్మించుకున్నారు, ఈ మందిరం లో ఈత కొలను నిర్మించుకొనిరి. ఇతని మందిరం ఒక కోట లాగ ఉండేడిది ఇతను ఈ ఇంట్లో తన నలుగురు భార్యలు, కూతురు తో అన్ని రకాల హంగులతో (సౌకర్యాలతో) నివసించేవారు.

 

అరవై సంవత్సరాల ప్రాంతాల్లో తనకు నలుగురు బార్యలున్నా పుత్ర సంతానం కలుగ నందుకు బాధపడేవారు. ఇతను ఒక ఇంగ్లీష్ వాడి లాగా దుస్తులు ధరించేది వారు. ఖాకీ రంగు ప్యాంటు మరియు చొక్కా, తలపై ఇంగిలీషు వారి టోపీ మరియు చేతిలో ఒక గన్ను (తుపాకీ) తో కనిపించెడి వారు.

ఒక సారి ఈయన తన ప్రాంతపు పన్నులు చెల్లించే, భూ వివాదాలు పరిష్కరించుకోవుటకు ప్రభుత్వ కార్యాలయము (నాగర్ కర్నూల్) నకు వెళ్లిరి. అక్కడ ఇతనికి తనలాగే దుస్తులు ధరించిన, తన హోదా తోనే ఇంకొక వ్యక్తిని చూస్తారు. అతను వనపర్తి సంస్థానాధీశులు రాజా రామేశ్వర్ రావు -1 అని, అయన తన పక్క ప్రాంత దేశముకీ అని తెలుస్తుంది. ఈ రాజా వారు గుఱ్ఱము నడపదములో మంచి ఆరి తేరిన వారుగా కనిపిస్తారు. ఇతను ఎప్పుడూ పక్క ప్రాంత దేశముఖీలతో యుద్ధాలు తలపెట్టేవారు. దీన్తో ఈయనా ఆఫ్రికా దేశ సైన్యాన్ని పోషించేవారు. ఇది నిజామ్ ప్రభువుకు సంతోషమైన విషయం. దీన్తో ఆయన ఈయనకు "రాజాసాహెబు" అని బిరుదు నిచ్చిరి.

రాజా రామేశ్వర్ రావు-1 గారు కూడా ఈయన గురించి విచారించి, రామా రెడ్డి గారి గురించి పూర్తిగా తెలుసుకుంటారు. ఈయనకు నలుగురు భార్యలని పుత్రసంతానం లేదని కూడా తెలుస్తుంది. ఐతే రాజా వారు తన సోదరి ఇరవై నాలుగు సంవత్సరాల వయసుతో అందంగా ఉంటుందని చెప్పి సోదరిని వివాహం చేసుకోవాలని రాజా రెడ్డి ప్రతిపాదిస్తారు. అప్పుడు అతను నిరాకరిస్తారు. రాజావారు వేటకు వెళ్ళినప్పుడు ఠానసోదరిని కూడా తీసుకెళ్లేవారు, రాజావారు ఈయనకు తన చెల్లి తప్పకుండా పుత్రసంతాన్ని ఇస్తుందని నచ్చ చెప్పడంతో వివాహానికి ఒప్పుకుంటారు. అనుకున్నట్టుగానే వారిరువురికి వివాహం జరిగి ఆమెకు ఇద్దరు కుమారులు ఒక కూతురు జన్మించిరి. ఈ సంతానం చిన్నవయసులో ఉండగానే రామా రెడ్డి గారు మరణించిరి.

రామా రెడ్డి కుటుంబ పరిస్థితిలో ఐదుగురు వితంతువులు, చిన్నవయసులో పిల్లలు దీనిని అదునుగా చేసుకొని బిజినాపల్లి కుటుంబం వారు తాడూరు నుండి రామా రెడ్డి పెద్ద కొడుకును (రామకృష్ణా రెడ్డి) ఆరు సంవత్సరాల వయసున్నప్పుడు అపహరిస్తారు. వారికి కూడా పుత్ర సంతానం లేకపోయేసరికి ఇలా చేసి ఈ అపహరణను చట్టబద్ధం చేస్తారు.

బిజ్జినాపల్లి కుటుంబాన్ని గురించి, ఆ ప్రాంతంలోని నిజాం ప్రభుత్వం కోసం పన్ను వసూలుదారు గా పనిచేసిన కరణం, తెలుగు రెడ్డికి సంక్రమించిన వ్యక్తి. ఈ వ్యక్తి (పేరు తెలియదు) అంటే కరణం బతుకు దేరుకు వచ్చిన ఒక తెలివైన బాలుడికి ఆశ్రయం ఇచ్చారు. ఈ బాలుడు కరణం కు అన్ని పనులలో సహాయం చేస్తూ, అతనితోనే ఉంది యజమాని నుండి చదవటం మరియు వ్రాయడం నేర్చుకున్నాడు. కరణం కు కూడా పిల్లలు లేరు. ఇతను చాలా సంపద కలిగిన పెద్ద భూస్వామి. కరణం ఈ యువ బాలుడిని దత్తత తీసు కుంటారు.

ఈ చిన్న బాలుడు వాస్తవానికి కడప జిల్లాలోని ప్రాక్టూర్ నుండి, మహబూబ్ నగర్కు వలసవెళ్లాడు, ఎందుకంటే నిరంతరం కరువు రావడం, మరియు తల్లి చనిపోవడం తో,  ఏడుగురు సోదరులు మరియు  తండ్రి తో కలిసి ఈ ప్రాంతానికి వచ్చెను. ఇలా వచ్చిన ఏడుగురు ప్రతి ఒక్కరు జీవనోపాధి కోసం వివిధ గ్రామాలలో స్థిరపడ్డారు. అక్కడి కారణంవారు ఈయన కూడా రెడ్డి అవుటచే తనఈ ఆస్తి నంతటిని ఇతనికి అప్పచెప్పి మరణించిరి. ఈయనకు పెళ్లి చేసుకున్న తరువాత ఇరవై ఒక్క సంతానం కలిగిరి.

  తర్వాతి పేజి

 
























































back       began       home       next                         
 line
address