రామ చంద్రమ్మ కు ఒక కుమారుడు,
ఐన ధర్మా
రెడ్డి. ఈయన సంతానం మహావీర్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి,
గిరిజా రెడ్డి
మరియు ఒక కూతురు,
ఈమె ఏకైక
సంతానం సుకమ్మ.
ఈ ఇద్దరు అక్కా చెల్లెల్లు రామలక్ష్మమ్మలను,
పల్లెపాడు ఇద్దరు వేరు తల్లుల సంతానమైన సోదరులను
పెళ్లాడిరి. వీరు అక్కడి జాగీరుదారులు. జాగీరుదారులు దేశ్ ముకుల
కన్నా పెద్ద స్థాయి వారు. బిజ్జన పల్లి వారు జగ్గమ్మ మొదటి
సంతానానికి కూడా చనిపోయిన రామలక్ష్మమ్మను శాంతపరచ దానికి,
రామలక్ష్మా రెడ్డి అని పేరు పెట్టిరి.
మా తాతగారైన బిజ్జుల వెంకట నరసింహా రెడ్డి గారు మా
నాయనమ్మ రామ లక్ష్మమ్మను పెళ్లి చేసికొనక ముందు, రాణి శంకరమ్మ సోదరుడి (చార్లెస్ వాహబ్) కూతురు సీతమ్మ ను
వివాహమాడిరి. అంటే మా తల్లి (విమలా దేవి గారి తండ్రి గోవిందా
రెడ్డి గారి పెద్ద చెల్లెలు) అత్తగారు. గోవిధా రెడ్డి గారి నాన్న
గారు చార్లెస్ వాహబ్.
ఈయన చాలా పెద్ద ధన వంతుడైన నల్గొండ జిల్లా బాబు సాయి పెట్
దేశ్ముఖ్. అతని పాలనలో వంద గ్రామాలు ఉండేవి. ఈయనకు హైదరాబాదు
నిజాము ప్రభువుతో చాలా సాన్నిహిత్యం ఉండేది
ఈ చార్లెస్ వాహబ్ వనపర్తి సంస్థానాన్ని రాణి శంకరమ్మ పేర
చక్కగా పాలించిరి. ఇది అప్పటికి ఉన్న నల్గొండ జిల్లా లోని వంద
గ్రామాలు కలిపి పాలించిరి.
సీతమ్మ కు, మా తాతగారికి ఒక మగ సంతానం, ఆయన పేరు బిజ్జుల చంద్రశేఖర రెడ్డి ఈయన పల్లెపాడు గ్రామ
జాగీరుదారు. సీతమ్మ
గారు తన కుమారుడు యుక్త వయసులో ఉండగా మరణించిరి,
అప్పుడు మా తాతగారు బిజ్జనపల్లికి చెందిన
రామలక్ష్మమ్మను రెండవ వివాహం చేసుకొనిరి. వీరికి ఒక పుత్రుడు
జన్మించెను. వీరే బిజ్జుల రామేశ్వర రెడ్డి,
జాగీరుదారు, మా తండ్రిగారు మరియు ఇద్దరు చెల్లెల్లు రుక్నమ్మ మరియు
సీతమ్మ(ఈ పేరును అతని మొదటి భార్య జ్ఞపకార్థం పెట్టిరి.). ఈవిడ
పేరు పెళ్లి తర్వాత ప్రమీల పింగళి గా మారింది.
రుక్నమ్మ బిజ్జుల కుటుంబంలోని వారినే వివాహమాడింది.
వీరి కొడుకు జైపాల్ రెడ్డి మరియు ఐదుగురు కూతుర్లు. సీతమ్మ పెళ్లి
తరువాత ప్రమీలా పింగళి గా మారిన ఈమెను పింగళి వెంకట రామి రెడ్డి
వరంగల్ వాస్తవ్యులు,
పెద్ద పారిశ్రామికవేక్త,
గారి కుమారుడు పింగళి జగన్మోహన్ రెడ్డి కి ఇచ్చి
వివాహం చేసిరి. ఈయన భారత దేశ సుప్రీం కోర్టు న్యాయవాదిగా కూడా
ఎదిగారు.
బిజ్జనపల్లి ఆస్థానాన్ని వనపర్తి పాలకురాలు రాణీ
శంకరమ్మ పాలించిరి. ఈవిడ రాజా రామేశ్వర రావు -1 గారి భార్య. అత్తగారు మనాగమ్మ గారు చనిపోయిన తర్వాత ఆమె
పెంచుకున్న కుమారుడు తాడూరు రామేశ్వర రెడ్డి గారు కూడా చాలా బలహీన
పడిరి. తన ఎస్టేటును కుటుంబాన్ని సరిగా చూసుకొనలేక పోతారు. ఈ
కుటుంబం బిజ్జనపల్లిలో ఉన్న రాజా సాహెబు చెల్లెలి కుటుంబం
అయ్యింది. ఈమె తాడూరు దేశ్ముఖ్ రామి రెడ్డి గారిని వివాహ మాడింది.
రామి రెడ్డి గారి ఇతర కుమారుడు తాడూరు వారసుడు,
ఇతను చాలా
స్వతంత్రుడుగా ఎదిగి తన కుటుంబం,
బిజ్జనపల్లిని,
వానపర్తిని పట్టించుకొంటారు.
ఇది మా నాయనమ్మ కథ. నాటి తరాలను చూసిన,
వారితో కలిసి ఉన్న ఒకే ఒక్క వ్యక్తి మా నాయనమ్మ
కిష్టమ్మ. (ఈమె కి పదకొండు మంది సంతానం). ఇప్పుడు ఆమె
సికిందరాబాదులోని మారెడ్ పల్లిలో నివాసముంటుంది. ఆమెకు చాలా మంచి
జ్ఞాపక శక్తి,
మంచి అవగాహన.
ఆమెకు నాటి జ్ఞాపకాలన్నీ చాలా ఆశ్చర్యకరంగా, అద్భుతంగా గుర్తు ఉన్నాయి. ఆమె మాకు ఈ వివరాలన్నీ చాలా
స్పష్టంగా అందించినందకు,
మా ఈ ప్రయత్నం
మొత్త్తన్ని ఆమెకు అంకితం చేస్తున్నాము.
మా నాయనమ్మ సోదరుడి (రంగా రెడ్డి గారు) కూతురు
కమలమ్మకు కూడా కృతజ్ఞతలు తెల్పుతున్నాము. ఈ చరిత్రను
తెలుసుకోవడానికి వారే మమ్మల్ని ప్రోద్భలపరిచినారు. ఆమె కూడా ఒక
మంచి మేధావి అలాగే
పుస్తకాలు కూడా రాసిరి.
రంగా రెడ్డి గారు కలకత్తాలో చదివిరి. ఈయన
న్యాయశాస్త్రాన్ని అభ్యసించి మహబూబ్ నగరులో మంచి పేరొందిన
న్యాయవాదిగా చేసిరి. ఇతన్ని వనపర్తి పాలకులైన శంకరమ్మ గారు
చదివించిరి. ఈమె అతని మిగతా సోదరులను కూడా ఉన్నత విద్యలను
చదవడానికి సహకరించిరి. ఈ రకంగా మొత్తం బిజ్జనపల్లి కుటుంబంలో అందరూ
మంచి విద్యావంతులైనారు. రంగా రెడ్డి గారికి పెద్ద వాడైనా చైనా
రెడ్డి గారి కుమారుడు వనపర్తి వారి కుటుంబం నుండి వివాహం
చేసుకొనిరి.
మా నాయనమ్మకు ఉన్న ఒక సోదరుడు,
వీరు కమలమ్మ గారి తండ్రిగారు వీరిరువురిని వారి పిన
తండ్రిగారు పెంచిరి. ఈయనే చనిపోయేంత వరకు ఆ కుటుంబ పెద్ద. ఈయన తన
కుమారుడితోపాటు,
నాలుగు కూతుర్లు, ఇద్దరు కుమారులను కూడా చదివించి పోసించిరి. అమ్మాయిలనంతా
మంచి కుటుంబాలకిచ్చి వివాహం చేసిరి.
చివరగా, మా నాయనమ్మకు, మా అత్తమ్మ గారికి (మా తండ్రిగారి సోదరి) పింగ్లే (ప్రమీల
రెడీ) సీతమ్మలకు కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. మేము కిష్టమ్మ
నాయనమ్మతో చాలా సమయం కూర్చొని ఇవన్నీ చర్చించి రచించడానికి
సంహరించినందుకు వారికి ఈ కుతజ్ఞతలు. ఈమె తన కోడలు కమలమ్మతో కలిసి
చరిత్రను చక్కగా విపులీకరించిరి.
|