నేటి బిజ్జల వంశస్థులు బిజ్జల
దేవుడి ఇరవైఏడవ (27)
వ వారసత్వం వారు. బిజ్జల దేవుడు,
శ్రీలంక కూడా అంతర్భాగమైన
భారతదేశాన్ని పాలించిన మహారాజు.
నాటినుంచి నేటివరకు వారి
వంశక్తులు,
చరిత్రకారులు వారి చరిత్రను
కాపాడుతూ తర్వాత తరాలకు అందిస్తూ
వచ్చారు. వాటి ఆధారంగానే ఈ
చరిత్రను అంతర్జాలం ద్వారా
అందింగల్గుతున్నాం.
|
కీ.శే. శ్రీ రామేశ్వర రెడ్డి గారి
111వ జన్మదిన జ్ఞాపకార్థం
|
నేడు,
మా తండ్రి గారైన బిజ్జల రామేశ్వర్
రెడ్డి గారు,
బిజ్జల పూర్వికులు అందించిన
చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసి
మాకు అందించడం జరిగింది. భారతదేశ
చరిత్రకు సంబంధించిన పుస్తకాలలో
కూడా బిజ్జల దేవుడి చరిత్ర
కనిపిస్తుంది. బిజ్జల దేవుడి
పరిపాలనా కాలంలో ఒక కొత్త పట్టణ
నిర్మాణం కూడా జరిగింది. అదే నాటి
బిజ్జన హళ్లి నేటి బీజాపూర్. నాడు
ఏడు ప్రాంతాలైన గజకనహళ్లి,
బజ్కనహళ్లి,
చందంకిరి,
క్యాడ్గి,
కాటర్కిరి మరియు కురన్ కుట్టి
లను ఏకం చేసి బిజ్జన హళ్లి
నిర్మాణం జరిగింది. తర్వాతి
కాలంలో అది విజయపుర గా మారింది. ఈ
విజయపుర ప్రస్తావన బీజాపూర్
మున్సిపాలిటీ యొక్క సెంటినరి
సావనీర్
1854-1954
లో కనిపిస్తుంది. కాలాచూరి బిజ్జల,
పదవ,
పదకొండవ శతాబ్దంలో చాళుక్య
మహామండళేశ్వరుడి ఆధీనం నుండి
బిజ్జన హళ్లిని ఏర్పాటు చేసినట్టు
అక్కడి శిలాశాసనాలు కూడా
వ్యక్తపరుస్తున్నాయి. అదే
బిజ్జనహళ్లి పదమూడవ శతాబ్దం
నాటికి బీజాపూర్ గా నామాంతరం
జరిగింది.
బిజ్జల దేవుడు మరియు వారి తర్వాత
వారసులు కూడా మంచి యోధులే కాకుండా
సాహిత్యం పట్ల
మంచి పట్టు
ఉన్నవారే. వారు మంచి కవులు,
రచయితలు,
అలాగే మంచి పరిపాలనా దక్షత కల్గిన
వారు,
వారి చరిత్ర చదవడం పాఠకులకు ఒక
మంచి అనుభూతిని ఇస్తుంది అనడంలో
సందేహం లేదు.
|