బిజ్జుల రామేశ్వర్ రెడ్డి గారు మా
పూర్వీకుల వారసత్వం హక్కులు కలిగి ఉన్న చిట్ట చివరి జాగీరుదారు గారు.
వీరు మరియు వీరి సోదరులైన కెప్టెన్. డాక్టర్.బి. పద్మనాభ రెడ్డి తో
కలిసి మద్రాసు
విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో చదువుకున్న మా కుటుంబంలోని మొదటి వారు. ఈయన తన
ఉన్నత పాఠశాల విద్యను
1927
లో
పూర్తి చేసెను. మరియు అతని సోదరుడు కెప్టెన్ డాక్టర్ బి. పద్మనాభ రెడ్డి
వైద్యశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు మరియు వారు భారత సైన్యంలో ఆర్మీ
మెడికల్ కార్ప్స్లో లో చేరారు
బిజ్జుల రామేశ్వర రెడ్డి గారు ఆయన సోదరులతో
కలిసి ఒక చిన్న జాగీరుదారు అయిన,
పల్లెపాడు జాగీరుదారును ఆరు గ్రామాలతో కలిపి భారతదేశం
గణతంత్ర దేశంగా మారిన నాటి వరకు అంటే 1950 వరకు పాలించిరి. బిజ్జుల
రామేశ్వర రెడ్డి గారు చాలా ఉన్నతమైన భావాలు కల్గి ప్రజలకు,
అలాగే నిరక్షరాస్యుల అవసరాలను తీర్చి,
వారిని
ఆదుకొనే వారు.
బిజ్జుల రామేశ్వర రెడ్డి గారి పెద్ద
సోదరులు బిజ్జుల చంద్రశేఖర రెడ్డి గారు,
వీరి తండ్రిగారి గారి తర్వాత వీరు మంచి పాలకులుగా చేసి మంచి
పేరు సంపాదించిరి.. వీరికి ముగ్గురు కుమారులు. వారు,
డాక్టర్. పద్మనాభరెడ్డి,
బి.
గోవర్ధన రెడ్డి మరియు జనార్దన్ రెడ్డి,
కూతురు ఇంద్రా దేవి. బిజ్జుల రామేశ్వర రెడ్డి గారి చిన్నాన్న
కుమారులు బి. ధర్మా రెడ్డి గారు,
వీరు గొప్ప వేట గాడు,
వీరికి మంచి ఆహారం,
జీవిత
పై మక్కువ. వీరికి ఇద్దరు కుమారులు. వారు,
బి. మహావీర్ రెడ్డి అమరియు బి. విజయ కుమార్
రెడ్డి అలాగే కూతురు గిరిజా దేవి.
బిజ్జుల రామేశ్వర రెడ్డి గారికి ఇద్దరు
చెల్లెల్లు రుక్మిణీ దేవి మరియు సీతా దేవి (ప్రమీలా పింగ్లే). రుక్మిణీ
దేవి ఆమె మేనమామ ను వివాహ మాడింది. వీరు బిజ్జనపల్లి లో పెద్ద భూస్వాములు.
వీరికి ఒక కుమారుడు మరియు ఐదుగురు కూతుళ్లు.
బిజ్జుల రామేశ్వర రెడ్డి
గారి ఇంకో సోదరి సీతా దేవి (ప్రమీలా పింగ్లే) ఈమెను జస్టిస్ పి. జగన్మోహన్
రెడ్డి గారికి ఇచ్చి వివాహం చేసిరి. (ఈయన ఒక పెద్ద పారిశ్రామిక వేత్త,
పింగ్లే వెంకట్రామి రెడ్డి
గారి కుమారులు) వీరు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ గా
చేసి,
సుప్రీం కోర్టు జడ్జిగా
వెళ్లిరి. వీరికి ముగ్గురు కుమారులు ఒక కూతురు.
బిజ్జుల వంశం యొక్క ప్రస్తుత వారసులు
|
తర్వాతి పేజి
|
|