ప్రాక్టూర్ ను ఈ రాజులు క్రీ.శ.1790 లో నర్సింహా భూపాలుడు (పెద్ద నరసింహ రెడ్డి) చనిపోవడంతో కోల్పోయిరి. ఈ రాజుకు ఆయన దాయాదులు విషమిచ్చి చంపిరి. అప్పుడు అతని భార్య రాణి చెన్నమ్మ దేవి కొల్లాపూర్ రాజావారి దగ్గర ఆశ్రయం పొందెను. ఈ కొల్లాపూర్ రాజులకు బ్రిటీష్ రాజులతో మంచి సంబంధాలు ఉండడం వలన నాటి నిజాం ను ఒప్పించి రాణి చెన్నమ్మ దేవి కి చిన్న జారీరు (పల్లెపాడు జాగీరు) ను ఆరు గ్రామాలతో పల్లెపాడు కేంద్రంగా ఇప్పించిరి. ఈ రాణి తన సొంత మారక నాణాలను రెవెన్యూ లో కొనసాగించెను. ఈ నాణాలు బ్రిటీష్, నిజామ్ నవాబులు గుర్తించిన వెండి, బంగారుతో తయారు చేయబడెను. భారతదేశం గంతంత్రంగా మారిన సంవత్సరం 1951 నాటికి రాణి చెన్నమ్మ దేవి సొంత ఆర్థిక శాఖను నిర్వహించి, తర్వాత దానిని శాశ్వత పరచిరి; పల్లెపాడు అనే పేరు వెనక చరిత్రను చూస్తే దీని పూర్వ పేరు పాన్యగ్రహి. ఇక్కడ బిజ్జల దేవుడి ద్వారా అభివృద్ధి చెందిన జైన మత ప్రభావం తో ఈ పేరు వచ్చెనట, ఎందుకంటే జైన మత ప్రాబల్యం ఉన్న చాలా ప్రాంతాలు, వాటి పేర్లు "పాడ్" తో పూర్తవుతాయి. ఇలా ప్రభావితం కాబడిన ప్రాంతాలు వీరి రక్షణ లో ఉండేవి. ఆ రకంగా పాణ్యపాడ్, పల్లెపాడు గా మారింది.

ఇంగ్లీష్ వారు ఈమెకు కష్ట సమయంలో మంచిగా బలపరిచారు. మరియు కొల్లాపూర్ రాజావారు ఈమెను కూతురులా చూసుకొని క్రీ.శ.1759 లో జాగీర్ని చేసిరి. దీన్తోపాటు కొల్లాపూర్ రాజు వారు వెయ్యి ఎకరాల భూమిని బహుమతి గా ఇచ్చెను. కానీ ఈమె ఈ భూమి పై ఎలాంటి అధికారాన్ని తీసుకోకుండా తరువాత దానిని కొల్లాపూర్ సంస్థానానికి తిరిగి ఇచ్చెను. ఈమెకు ముగ్గురు అక్కా, చెల్లెళ్ళతో ఉండేది,  వీరు    జాగీరులో


భాగాన్ని కోరగా  ఒక్కక్కరికి  ఒక  ఊరు  వచ్చింది.  రాణి  చెన్నమ్మ  దేవి పాలించిన ఐదు

ఊరులు పల్లెపాడు జాగీరు వాటి పేర్లు పల్లెపాడు, బోరవల్లి, జలపురం,  కతూర్ మరియు ప్రాక్టూర్. మిగతా వారికి మారముంగల్ గ్రామం వచ్చింది. రాణి చెన్నమ్మ దేవి కుమారుడు బిజ్జల వెంకట ధర్మా రెడ్డి, మంచి భక్తి భావాలు కలవాడు. ఇతనికి వేదాలు, ఉపనిషత్తుల పై మంచి పట్టు ఉండేది. దీన్తో ఇతని దగ్గరకు మంచి మంచి ఋషులు హిమాలయ ప్రాంతం నుండి, కేరళ ప్రాంతం నుండి వచ్చెడివారు. ఆలా వచ్చిన సాధువులలో ఒక అయన హిమాలయాల నుంచి పల్లెపాడుకు వచ్చినపుడు తన యోగ శక్తుల తో ఒక కిలోమీటరు వెడల్పు ఉన్న కృష్ణా నదిలో నీటి మీద నడిచినాడట. ఈ విషయాన్ని ఇతని కుమారులైన బిజ్జుల నరసింహా రెడ్డి గారు, మాకు తాత గారు, కూడా స్వయంగా వీక్షించారట.

ఈయన కుమారులైన బిజ్జుల వెంకట నరసింహా రెడ్డి  గారు, అతని నాయనమ్మ ఐన రాణి చెన్నమ్మ వారసత్వంతో జాగీరుని పాలించెను. ఇతను క్రీ.శ.1875 లో ఒక లక్ష రూపాయల ఖర్చుతో పెద్ద వెవసాయానికి నీరు అందించుటకు కాలువలను త్రవ్వించి ట్యాంక్ ను నిర్మించి నూటయాభై ఎకరాలకు నీరందించిరి. ఇతను యూరోప్ మరియు లండన్ దేశాలకు ఇండిగో-నీలి రంగులను బొంబాయి నుండి నౌకల ద్వారా ఎగుమతి చేసిరి. ఇండిగో-నీలి రంగు పరిశ్రమను వంద ఎకరాలలో ప్రపంచంలోనే శ్రేష్టమైన రంగును పల్లెపాడులో తయారు చేసి ఎగుమతి చేసేవారు. అలాగే ఒక వంద ఎకరాలకు పైగా మామిడి తోటను పెంచి రకరకాల మామిడి జాతి పళ్ళను పండించిరి. ఈ మొక్కలను లాహోర్ మరియు ఢిల్లీ ప్రాంతం నుండి తెప్పించిరి.

ఇతడికి దైవ భక్తి మెండుగా ఉండెను. వనపర్తి కోటకు ఒకసారి వచ్చినప్పుడు "నరసింహస్వామి" దర్శనం కూడా అయినది  అని  అంటారు  అక్కడి వారు. ఇతని వారసులు ఇప్పటికి పల్లెపాడు ప్రాంతంలో నివసిస్తున్నారు.

భారతదేశంలో జాగీరు దారు తనాన్ని నిర్మూలించిన నాటికి చిట్టా చివరి జాగీరు దారు బిజ్జల చంద్రశేఖర్ రెడ్డి ఈయన  బిజ్జుల  వెంకట నరసింహా  రెడ్డి  గారి  మొదటి  భార్య  సీతమ్మ కుమారులు. బిజ్జుల చంద్రశేఖర్ రెడ్డి పిన తల్లి కుమారులు అనంత రెడ్డి కుమారులు బిజ్జుల వెంకట ధర్మా రెడ్డి. బిజ్జుల వెంకట నరసింహా రెడ్డి గారి రెండవ భార్య "రామలక్ష్మీదేవి" కుమారులు బిజ్జుల రామేశ్వర రెడ్డి గారు.

 

ఈ వివరాలన్నీ గత మూడు వందల సంవత్సరాలుగా మా కుటుంభం జాగ్రత్తగా కాపాడబడుతూ వచ్చిన దస్త్రాల ఆధారంగా అందించబడింది. బిజ్జుల రామేశ్వర రెడ్డి గారు ఈ చరిత్రనంతా ఆయన చిన్న కుమారులైన బిజ్జుల అనిరుద్ కుమార్ గారికి వివరిస్తూ వచ్చారు. తర్వాతి తరాలకు ఈ చరిత్రను అందిచడానికి ఈయన ప్రయత్నం.

 

బిజ్జుల వెంకట ధర్మా రెడ్డి గారు భక్తి, మతాలపై చాలా పుస్తాకాలు ప్రచూరించిరి. 1960 లో బిజ్జుల రామేశ్వర రెడ్డి గారు చాళుక్యుల /

చోళుల కాలం నాటి రాగి పత్రాలు / పలకలు గురించి ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించి ఈ ప్రాంతం యొక్క పురాతన చరిత్రను తెలిపిరి.

ఇప్పుడు ఉన్న పల్లెపాడు గ్రామం ను క్రీ.శ.1796-1800 మధ్య కాలంలో కృష్ణా నదీ తీరాన రాణీ చెన్నమ్మ దేవి నిర్మించెను. దాది రెడ్డి నుండి మొదలుకొని వీరంతా కృష్ణా నాదీ తీరాన కోటలు నిర్మించిరి. అవి రాయచూరు,

ఆలంపూర్, ప్రాక్టర్ అలాగే పల్లెపాడు గ్రామాలు. బిజ్జుల వారంతా ముఖ్యంగా శైవ మతారాధకులు అలాగే శివుడి అవతారం మల్లి అవతరిస్తుందని నమ్మిన వారు. వీరికి ఈ మత పెద్దను ఏర్పాటు చేసుకొనే అధికారం కల్గి ఉంది, క్రీ.శ.1950 వరకు మత పెద్దలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ మత పెద్దను చాలా పవిత్రులుగా భావించెడివారు. నేడు మన శంకరాచార్యుల లాంటి గురువులలాగా నాడు వారు ఏర్పాటు చేసుకొనిరి.

మహబూబునగరు జిల్లా లోని గద్వాల సంస్థానానికి దగ్గరలలో పరశురామ దేవస్థానం గత వేయి సంవత్సరాలు గా పూజలందుకొంటుంది. ఇది క్రీ.శ.12వ శతాబ్దం నాటి నుండి, బిజ్జల దేవుడి కాలం నాటినుండి అక్కడి గొర్రెల కాపరి / బోయ కులం వారి చేత చూసుకొన బడుతుంది. ఈ కుల పెద్దనే ఈ పరశు రాముడి గుడికి పూజారిగా ఉండెడివారు. 

 

ఈ పరశు రాముడి గుడికి ప్రతీ సంవత్సరం నిధులు పంపడం, పల్లెపాడు చెన్నకేశవ స్వామి గుడి ట్రస్ట్ కు పెద్ద ఐన బిజ్జుల రామేశ్వర రెడ్డి ఆనవాయితీగా చేసుకున్నారు. ఈ నిధులు పరశు రాముడి గుడి పూజారికి, వారి కుటుంబ పోషణ కొరకు పంపిరి. ఈ నిధులను ప్రతీ సంవత్సరం మార్చి /ఏప్రిల్ నెలలో చెన్నకేశవ స్వామి ఉత్సవాల కాలంలో పంపే వారు. పరశురాముడి చేత క్షత్రీయులంతా అంతం కాగా మిగిలిన బ్రహ్మ, సోమ (చంద్రుడు) ల క్షత్రీయుల వారసులు గా ఉన్నందున ఇది వారు కృతజ్ఞతాపూర్వకంగా ఇస్తూ ఉన్నారు.

ఇప్పుడు ఈ ప్రదేశం కాళీ దేవత ఆలయానికి చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడి ప్రాంతం అంటే గద్వాల, ఆలంపూరు ప్రాంతాల చుట్టూ ఉన్న రైతులు వారం  రోజుల పాటు ఇక్కడ భక్తితో తమని ఆరోగ్యంగా మరియు చల్లగా ఉంచమని దేవిని కోరుతూ జాతర నిర్వహిస్తారు. వేసవి కాలం లో మహారాష్ట్ర మరియు కర్ణాటక నుండి చాలా మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి ఒక రాత్రి ఇక్కడ నిద్రించి వెళుతారు.

  ముందు పేజి

 

 
































































































































back       began       home       next                         
 line
address