ప్రాక్టూర్ ను ఈ రాజులు క్రీ.శ.1790 లో
నర్సింహా భూపాలుడు (పెద్ద నరసింహ రెడ్డి) చనిపోవడంతో
కోల్పోయిరి. ఈ రాజుకు ఆయన దాయాదులు విషమిచ్చి చంపిరి. అప్పుడు అతని
భార్య
రాణి చెన్నమ్మ దేవి కొల్లాపూర్
రాజావారి దగ్గర ఆశ్రయం పొందెను. ఈ కొల్లాపూర్ రాజులకు బ్రిటీష్
రాజులతో మంచి సంబంధాలు ఉండడం వలన నాటి నిజాం ను ఒప్పించి రాణి
చెన్నమ్మ దేవి కి చిన్న జారీరు
(పల్లెపాడు జాగీరు) ను ఆరు
గ్రామాలతో పల్లెపాడు కేంద్రంగా ఇప్పించిరి. ఈ రాణి తన సొంత మారక
నాణాలను రెవెన్యూ లో కొనసాగించెను. ఈ నాణాలు బ్రిటీష్, నిజామ్ నవాబులు గుర్తించిన వెండి,
బంగారుతో తయారు
చేయబడెను. భారతదేశం గంతంత్రంగా మారిన సంవత్సరం
1951 నాటికి రాణి
చెన్నమ్మ దేవి సొంత ఆర్థిక శాఖను నిర్వహించి,
తర్వాత దానిని
శాశ్వత పరచిరి;
పల్లెపాడు అనే పేరు వెనక చరిత్రను చూస్తే దీని పూర్వ పేరు
పాన్యగ్రహి. ఇక్కడ బిజ్జల దేవుడి ద్వారా అభివృద్ధి చెందిన జైన మత
ప్రభావం తో ఈ పేరు వచ్చెనట,
ఎందుకంటే జైన మత ప్రాబల్యం ఉన్న చాలా ప్రాంతాలు,
వాటి పేర్లు "పాడ్" తో పూర్తవుతాయి. ఇలా ప్రభావితం కాబడిన
ప్రాంతాలు వీరి రక్షణ లో ఉండేవి. ఆ రకంగా పాణ్యపాడ్,
పల్లెపాడు గా మారింది.
|
ఇంగ్లీష్ వారు ఈమెకు కష్ట సమయంలో మంచిగా బలపరిచారు.
మరియు కొల్లాపూర్ రాజావారు ఈమెను కూతురులా చూసుకొని క్రీ.శ.1759 లో జాగీర్ని
చేసిరి. దీన్తోపాటు కొల్లాపూర్ రాజు వారు వెయ్యి ఎకరాల భూమిని
బహుమతి గా ఇచ్చెను. కానీ ఈమె ఈ భూమి పై ఎలాంటి అధికారాన్ని
తీసుకోకుండా తరువాత దానిని కొల్లాపూర్ సంస్థానానికి తిరిగి
ఇచ్చెను.
ఈమెకు ముగ్గురు
అక్కా,
చెల్లెళ్ళతో ఉండేది,
వీరు
ఆ
జాగీరులో
|
|
భాగాన్ని కోరగా
ఒక్కక్కరికి
ఒక
ఊరు
వచ్చింది.
రాణి
చెన్నమ్మ
దేవి పాలించిన
ఐదు
ఊరులు పల్లెపాడు జాగీరు వాటి పేర్లు పల్లెపాడు, బోరవల్లి,
జలపురం,
కతూర్ మరియు ప్రాక్టూర్. మిగతా వారికి మారముంగల్ గ్రామం
వచ్చింది.
రాణి చెన్నమ్మ దేవి కుమారుడు
బిజ్జల వెంకట ధర్మా రెడ్డి,
మంచి భక్తి
భావాలు కలవాడు. ఇతనికి వేదాలు, ఉపనిషత్తుల పై మంచి పట్టు ఉండేది. దీన్తో ఇతని దగ్గరకు మంచి
మంచి ఋషులు హిమాలయ ప్రాంతం నుండి,
కేరళ ప్రాంతం నుండి వచ్చెడివారు. ఆలా వచ్చిన సాధువులలో
ఒక అయన హిమాలయాల నుంచి పల్లెపాడుకు వచ్చినపుడు తన యోగ శక్తుల తో ఒక
కిలోమీటరు వెడల్పు ఉన్న కృష్ణా నదిలో
నీటి మీద నడిచినాడట. ఈ విషయాన్ని ఇతని కుమారులైన బిజ్జుల నరసింహా
రెడ్డి గారు, మాకు తాత గారు,
కూడా స్వయంగా
వీక్షించారట.
ఈయన కుమారులైన బిజ్జుల వెంకట నరసింహా రెడ్డి
గారు,
అతని నాయనమ్మ
ఐన రాణి చెన్నమ్మ వారసత్వంతో జాగీరుని పాలించెను. ఇతను క్రీ.శ.1875 లో ఒక లక్ష
రూపాయల ఖర్చుతో పెద్ద వెవసాయానికి నీరు అందించుటకు కాలువలను
త్రవ్వించి ట్యాంక్ ను నిర్మించి నూటయాభై ఎకరాలకు నీరందించిరి.
ఇతను యూరోప్ మరియు లండన్ దేశాలకు ఇండిగో-నీలి రంగులను బొంబాయి
నుండి నౌకల ద్వారా ఎగుమతి చేసిరి. ఇండిగో-నీలి రంగు పరిశ్రమను వంద
ఎకరాలలో ప్రపంచంలోనే శ్రేష్టమైన రంగును పల్లెపాడులో తయారు చేసి
ఎగుమతి చేసేవారు. అలాగే ఒక వంద ఎకరాలకు పైగా మామిడి తోటను పెంచి
రకరకాల మామిడి జాతి పళ్ళను పండించిరి. ఈ మొక్కలను లాహోర్ మరియు
ఢిల్లీ ప్రాంతం నుండి తెప్పించిరి.
|