దాది రెడ్డి - రాయచూరు, ఆలంపూర్ మరియు ఆమన్గల్ పాలకులు.

బిజ్జల వారి కుమారులు సోమేశ్వర మరియు అతని సోదరులు, వీరు క్రీ.శ. 1168 నుండి 1183 వరకు దక్కన్ పీఠ భూమి ప్రాంతాన్ని పాలించారు. వీరు క్రీ.శ.1183 లో చాళుక్యుల చేతిలో ఓటమి చెంది రాజ్యాన్ని వారికి అప్పగించిరి. ఇతని తర్వాతి వారు కృష్ణా, తుంగభద్రా నదుల మధ్య చిన్న చిన్న ప్రాంతాలను దాదాపు 300 వందల సంవత్సరాలు (క్రీ.శ.1185 - 1500) ఈ కాలంలోని ముస్లిం రాజులు దక్షిణ ప్రాంతాలను చేజిక్కించుకున్నారు. వీరి మనుమడైన దాది, బీజాపూర్ సైన్యంలో ఒక ముఖ్య సైన్యాధ్యక్షుడు గా ఉండేవాడు. ఈయన 1516 లో విజయనగర సామ్రాజ్య సైన్యాన్ని ఓడించి రాయచూరు కోటను స్వాధీనపరుచుకున్నారు. ఆ సమయంలో కృష్ణదేవరాయ సైన్యం ఒరిస్సా ప్రాంతంలో నిమగ్నమవడం తో గజపతి ప్రాంతాన్ని ఇతను సులభంగా చేజిక్కించుకున్నారు.  ఐతే బీజాపూర్ నవాబు ఇతని ప్రయత్నాలకు విజయ ప్రమాణాలకు సంతోషించెను. తర్వాత

నవాబు అతనికి, అతను సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎంత ప్రయాణించ గాలిథె ఆ ప్రాంతాలన్నీ అతనికి బహూకరించి "రెడ్డి" అనే బిరుదు ను ఇస్తాననేను. ధీంతొ దాది రెడ్డి రాయచూరు కోట నుండి సూర్యోదయానే బయలుదేరి సూర్యాస్తమయానికి రాయచూర్, ఆలంపూర్ మరియు ఆమన్ గల్ ప్రాంతాలను ప్రయాణించి "పాన్యగ్రహి" అనే ఊరు చేరెను.

అదే నేడు పల్లెపాడు గ్రామం. అప్పుడు నవాబు ఇతనికి రాయచూరు కేంద్రంగా మూడు తాలూకాలను బహుకరించెను. దాది రెడ్డి ఈ మొత్తం ప్రాంతాలపై సర్వ హక్కులు కలిగి ఉండెను. బీజాపూర్ పాలకులకు ఇతను ఎప్పుడూ కావలసిన సహాయాలను అందిస్తూ వచ్చెను. కృష్ణదేవరాయలు పది లక్షలమంది సైన్యంతో, 500 ఏనుగులు సమకూర్చి రాయచూరు కోటను ముట్టడించెను. అప్పుడు బీజాపూర్ నవాబు శక్తివంతమైన అశ్వ దళాలతో సహాయానికి వచ్చెను, కానీ ఈ యుద్ధాన్ని కృష్ణదేవరాయలు పోర్చుగీసు సైన్యాధక్షుడి సహాయంతో గెలిచి కోటను స్వాధీన పరచుకొనెను. ఇతను ఈ యుద్ధం చేస్తూ క్రీ.శ.1520 లో మరణిస్తాడు. ఈ విషయాన్ని అక్కడి కోటాలో కూడా శిలాశాసనంగా చెక్కారు.

రాయచూరు కోటను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ, తన ప్రాణాలను కోల్పోయిన వీరుడు కథను నాట్యరూపకంగా, నాటక రూపకంగా గత నాలుగు వందల సంవత్సరాలనుండి నేటికీ అక్కడి ప్రజలు ప్రదర్శించుకుంటారు. దాది రెడ్డి కుమారులు కృష్ణా రెడ్డి మహబూబ్నగర్ జిల్లాలోని ఆమెన్ గల్, ఆలంపూర్ ప్రాంతాలను ఆలంపూరు ను కేంద్రం గా చేసుకొని పాలించెను. వీరు శైవ మతస్థులు, ఐదు తరాలవరకు ఈ ప్రాంతాలను పాలించిరి. వీరి ఆలంపూరు లోని శివాలయాలు పునరుద్ధరణ గావించడంతో, కాశీ తర్వాత అంతటి ప్రాధాన్యం  ఉన్న ఆలయాలుగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వీరి వారసులతో చివరి వాడైన కొండా రెడ్డి (క్రీ.శ.1597 - 1643) పేరుమీదే కర్నూల్ పట్టణంలోని కూడా రెడ్డి బురుజు కు ఆ పేరు వచ్చిందని చెప్పుకొంటారు. ఎందుకంటే అతని శౌర్యం మరియు ఇతని అలసిపోని ధైర్యానికి నిదర్శనం గా ఇది తరువాత కొండారెడ్డి బురుజుగా ప్రసిద్ది చెందింది. ఈయన గోల్కొండ నవాబుల ను ఎన్నో సార్లు యుద్ధంలో ఓడిస్తాడు, కానీ చివరకు ఒక సారి వారికి పట్టుబడతారు. నవాబులు ఇతనిని బంధించి ఆ కోటలో ఉంచుతారు. అప్పుడు ఇతను ఎంతో చాకచక్యంగా కోటలోనుండి కృష్ణ నది మీదుగా అలంపూర్ వరకు ఒక సొరంగ మార్గం తవ్వుకుంటూ కోట నుండి తప్పించుకున్నాడు. చివరకు గోల్కొండ రాజుల చేతిలో ఒడి తన రాజ్యాన్ని కోల్పోతాడు.  తర్వాత ఆ కుటుంబం తమ ఉనికిని క్రీ.శ.1665 లో ఆలంపూర్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్టూర్ కోటకు మార్చుకుంటారు.

వారు ప్రాక్టూర్ కోట ను కేంద్రంగా ఉన్న సుమారు 100 గ్రామాల చిన్న రాజ్యానికి స్వతంత్ర పాలకులు. ఈస్ట్ ఇండియా కంపెనీ కర్నూలు మరియు చుట్టుపక్కల ప్రాంతాలను నిజాముల నుండి తీసుకున్నారు. కానీ ప్రాక్టూర్ ప్రాంతాన్ని తర్వాత తొమ్మిది తరాల వారు పాలించిరి. వీరు రచనలు, కవితలు బాగా రాసేది వారు. ఈ రాజులలో ముఖ్యులు తిమ్మ భూపాలుడు.

ఈయన రాసిన కవితల సంపుటి "అనర్ఘరగము" పేరుతో ప్రచురించబడింది. వీరు చాలా పద్ధతితో ఉండిరి, కానీ సంతాన సమస్యలు ఉండెను. తిరుపతి దేవస్థానానికి చాలా భూమిని బహూకరించిరి. ధీంతొ అక్కడ మొదటి 

హారతి ఇవ్వడానికి ఏర్పాటు చేసిరి. ఈ రకంగా వీరు వైష్ణవ సాంప్రదాయం పాటించిరి. ఇదంతా వీరి తర్వాతి తరాల వారికీ మెగా సంతానం కలగాలని నమ్మకం కొరకు చేసిరి.
   

  ముందు పేజి

తర్వాతి పేజి


 







































































back       began       home       next                         
 line
address