బిజ్జలదేవుడి పరిపాలనలో ఉన్న ప్రధాన మంత్రి ఐన బసవరాజు శైవ మతాన్ని కోశాధికారులతో కలిసి శైవ మతాన్ని మహారాజు ఆశీస్సులతో పెంపొందించారు. ఈ మతంలో సమాజంలోని సంశ్యలకు జవాబు దొరికేది. ఈయన శైవ మాత ప్రచారంలో భాగంగా ఒర్రిస్సా నుండి ఆంధ్ర ప్రదేశ్లో ఉన్న అలంపూర్ వరకు శివాలయాలను నిర్మింప జేశారు. అలంపూర్ లో కోటి శివలింగాలతో ఈయన శివాలయాలు పునరుద్ధరణ చేశాడు. ఇది శైవులకి జైనులకు మధ్యన యుద్ధాన్ని నెలకొల్పింది. ఇది ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకి కూడా పాకింది. ప్రధాన మంత్రి అనుచరులు అంగ శైవులు జైనులపై విజయం సాధించి, జైన మాత ఆలయాలు, గ్రంధాలయాలు మరి వారి రచనలను నాశనం చేశారు. దీనితో బిజ్జల దేవుడు చాలా కృంగిపోయి తన కుమారుడు సోమేశ్వరుడికి 1168లో సింహాసనాన్ని అప్పాజోప్పి అడవులకు వెళ్లిపోయారు.

సోమేశ్వరుడు చోళులు, ఘనా మరియు చాళుక్యులును ఓడించి చాలా విజయాలను సొంతం చేసుకున్నారు. ఈయన పాలనలో వీరశైవం చాలా అభివృద్ధి చెందింది. ఇందులో ఎనిమిది అంచల మార్గాన్ని అనుచరుల మరియు ప్రజల యొక్క సమశ్యలు తీర్చడానికి వాడేవారు. బసవపురాణం ఈ కాలంలోనే రచించబడింది. ఇందులోని తత్వం ప్రజలను బాగా ఆకట్టుకొంది, కాబట్టి ప్రజలంతా మనస్ఫూర్తిగా దీనిని అంగీకరించి బిజ్జల వారి రాజధాని కల్యాణిని దర్శించడం జరిగింది. దీనితో వీరశైవమతానికి రాజధాని కళ్యాణి కేంద్రం అయ్యింది.

 

సోమేశ్వరుడు 1177లో చనిపోగా అతని శంకన రాజ్యపాలనను చేపట్టి బెంగాల్ నుంచి సిలోన్ వరకు ఎన్నో ప్రాంతాలను జయించాడు. ఇతని కాలంలో శైవులకు జైనులకు మరియు వైష్ణవులకు సామ్రాజ్యవాద మతం దిక్కుతోచని పరిస్థితి ఏర్పరిచింది.

 

1180లో శంకన తరువాత అహమవల్ల రాజ్యపాలన తీసుకున్నారు. ఇతను కూడా పెద్ద శివ భక్తుడు. ఇతను తుమ్బల, గొగ్గురు మరియు ఆలంపూర్ ప్రాంతాలనుండి వచ్చిన పన్నుల ద్రవ్యాన్ని శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి పంపించేవారు. దీకి సంబంచిన శాసనాలను సంస్కృతం మరియు తెలుగు లో అక్కడ చూడవచ్చు. అలాగే ఆలంపూర్ బ్రహ్మపురిగా పిలువా బడేది. అక్కడ బ్రహ్మపురి విద్య పీఠం వెలసి ఒక మంచి విద్యా కేంద్రంగా వెలుగొందింది. ఈ కేంద్రానికి ఎన్నో రకాలైన బహుమతులు, నిధులు ఎంతోమంది రాజులు, రాణుల చేత పంపించబడేవి. ఈ కేంద్రంలో త్రిలోచనమునినాథ మరియు ఏకాంత దేశకది అనే గొప్ప పండితులు ఉండేవారు. దీనికి సంబంధించిన వివరాలు శ్రీశైల దేవస్థానం వారు ప్రచురించిన పుస్తకాలలో కూడా చూడవచ్చు. ఈ మహారాజు దక్షిణ ప్రాంతాల్లోని చాలా భాగాన్ని చాళుక్యుల రాజు ఐన తైల-III యొక్క కుమారుడు సోమేశ్వర-IV చేతిలో కోల్పోయారు.

 

ఆహవమల్ల చిన్న రాజ్యాలను ఏర్పాటు చేసుకొని పాలిస్తూ, తన సోదరులైన సింగనకు 1183లో రాజ్యాన్ని అప్పచెప్పి సొమెహ్శ్వర-IV సేవలో వెళ్లారు. ఈ రకంగా 1190లో కాలచూరుల పాలన సమాప్తమైనది. 1190 తరువాత కళ్యాణి రాజ్యం మూడు భాగాలుగా విడిపోయి 1. యాదవులు పాలించిన దేవగిరి రాజ్యం, 2. కాకతీయులు పాలించిన వరంగల్ రాజ్యం, 3. హోయసాలులు పాలించిన దొరసముద్ర గా ఏర్పడ్డాయి.

  ముందు పేజి

తర్వాతి పేజి


 

back       began       home       next                         
 line
address