బిజ్జల
వారి పరిపాలన కొద్దికాలం మాత్రమే కొనసాగింది .ఈ పాలనా క్రీ. శ.1162 నుండి
1167 వరకు మాత్రమే.ఈ కాలంలో హొయసల
రాజు నరసింహ-I మరియు పాండ్య ముఖ్యులు ఉచ్ఛాంగి లకు
వ్యతిరేకంగా విజయవతంగా పోరాడారు. ఆలాగే సునాస్ మరియు చోళులనను,
ఆంధ్రా,
కళింగ ముఖ్యలను
కూడా లొంగదీసుకున్నారు. బిజ్జలవారు వారి పరిపాలనా విధానంలో క్రొత్త
పద్ధతులను అనుసరించారు. చరిత్ర కారుల కథనం ప్రకారం,
పరిపాలనా యంత్రాంగంలోని ముఖ్యులకు
మంచి విలువ నిచ్చారు. అలాగే వారి పై అధికారులపై నిఘా ఉంచడానికి కూడా వారికి
అనుమతి కల్పించారు. ఈ పధ్ధతి యంత్రఅంగంలోని వారి మొండితనం,
విపరీత పోకడలను అరికట్టేటందుకే. బిజ్జల వారు
కశ్శ్యాపనాయకులపై మంచి నమ్మకం ఉంచారు. ఈ కశ్యప నాయకులు కాలచూరుల రాజ్యంలో
ముఖ్యులుగా ఉన్నారు. వీర శైవుల మతాచార్యులైన బసవేశ్వరులు వీరి రాజ్యంలో
ముఖ్యమైన కోశాధికారిగా,
ఆ తరువాత ప్రధాన మంత్రిగా చేశారు.
బిజ్జుల వారి కాలంలో ఏడు ప్రాంతాలను
కలుపుతూ ఒక క్రొత్త పట్టణ నిర్మాణం జరిగింది. ఆ ఏడు ప్రాంతాలు,
గజకణ
హళ్లి,
బీజకణ
హళ్లి,
చదంకిరి,
క్యాడ్జి,
కథార్కిరి మరియు కురం కుట్టి వీటితో క్రీ. శ.1162
లో
బిజ్జనహళ్లి ని నిర్మించారు. తరువాత కాలంలో దీనిని విజయపుర
గా పిలిచారు (బీజాపూర్ మునిసిపాలిటీ
1854-1954
శతాబ్ది ఉత్సవాల పత్రికలో చూడ వచ్చు). ఈ విషయానికి సంబంధించి శిలాసనాలు
కూడా ఉన్నాయి. చాళుక్య మహామండలేశ్వరులు,
బాదామి
పాలకులు బిజ్జల వారు బీజాపూర్ (బిజ్జనహళ్లి) పట్టణ నిర్మాణం
10-11 వ
శతాబ్ద కాలంలో చేపట్టారు. ఈ పట్టణం పదమూడవ శతాబ్దంలో క్రీ.శ.1347 కాలంలో
ఢిల్లీ సుల్తానులైన ఖిల్జీ ఆధీనంలోకి వచ్చింది. గుల్బర్గా బహమనీ సుల్తానులు
దీని గెలిచినట్టు తర్వాత దీనిని బీజాపూర్ గా పిలువా బడుతుంది.
బీ. ఎల్. రైస్ వంటి మేధావులు బిజ్జలను
జైనులుగా వర్ణించారు. ఈ అపోహకు ఆధారం విరూపాక్ష పండితులు రచించిన చెన్నబసవ
పురాణం,
ధరణి
పండితులు రచించిన బిజ్జలరాయ చరితం మరియు చంద్రసాగర వర్ణి రచించిన బిజ్జలరాయ
పురాణం. కానీ శాసనాల ప్రకారం బీజాల వారు శైవులని తెలుస్తుంది. నిజానికి ఈ
కాలం లో ఏకాంతద రామయ్య,
గొగ్గి
దేవ మరియు విరూపరస తో శైవ ఆచారాలు బలోపేతమైనాయి. కాలచూరుల పరిపాలకులు
షావూలు అయినప్పటికీ అతని ప్రధానమంత్రి ఐన బసవేశ్వరుని తిరుగుబాటు పోకడలు
నచ్చలేదు. ఈ పాలకుడు మంచి శైవ ఆచార బద్ధుడు. ఇది వీరశైవ పోరాటాన్ని
బిజ్జలవారి వ్యతిరేకతను తెల్పుతుంది.
బిజ్జల వారు క్రీ.శ.
1167
లో తన
రెండవ కుమారుడు సోవిదేవుడు కొరకు సింహాసనం వదిలి పెట్టారు. కానీ అది
సమస్యను తీర్చక పోగా,
కాలచూరుల రాజ్యాన్ని కదిలించివేసి బిజ్జల వారిని నిందితున్ని చేసింది. కొంత
మంది మేధావుల ప్రకారం ఈ సమస్య రాజకీయపరమైనది,
కాసపయ్య
నాయక లాంటి పెద్ద అధికారులచేత ఈ కుట్ర జరిగింది అని అంటారు. కానీ పి.బి.
దేశాయ్ ఉద్దేశంలో బిజ్జల వారి వీరశైవ మత వ్యతిరేకత ఈ చర్యకు దారితీసింది.
బసవేశ్వరుడు హింసకు అనుమతించనప్పటికీ అతని అనుచరులు రెచ్చ్పోయారు. బిజ్జల
వారు క్రీ.శ.1168
లో
కళ్యాణి చుట్టూ ఉన్న అడవిలోకి వెళ్లి మరణిస్తారు.
బిజ్జల వారి తర్వాత వారసుడు సోమదేవ/
సోమేశ్వర చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చింది. అయినప్పటికీ క్రీ.శ.1176
వరకు
పాలించిరి. వీరి తర్వాత వీరి చిన్న తమ్ముడు మల్లుగీ పాలించిరి. కానీ
అనతికాలంలోనే ఆయన సోదరుడు సంకమ రాజ్య భారాన్ని తీసుకున్నారు. వీరు క్రీ.శ.1180
వరకు పాలించిరి. వీరి తర్వాత వారు
ఆహవమల్ల (1180
నుండి
1183)
మరియు
సింగన (1183
నుండి
1184)
ఈ
కాలంలో కాలచూరులు బలహీనపడి చాళుక్యుల చేతిలో తమ రాజ్యాన్ని కోల్పాయారు. ఈ
రకంగా కాలచూరుల పరిపాలన అంతికాలం మాత్రమే కొనసాగింది.
ముందు
పేజి
|
తర్వాతి పేజి
|
|