బసవేశ్వరులు క్రీ..1105 లో ఆనాటి బాగేవాడి నేటి కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూరులో జన్మించారు. వీరు బ్రాహ్మణులు, వీరి తల్లి తండ్రుల పేర్లు మదిరాజ మరియు మదంబ వీరశైవ మతాన్ని ఈయనే స్థాపించారు. ఈయన బిజ్జల మహారాజు కాలంలో (క్రీ. 1157-1167) నేటి బొంబాయికి దగ్గరగా ఉన్న కల్యాణ ప్రాంతాన్ని దర్శించారు. బసవన్నకు నాటి ప్రాచుర్యంలో ఉన్న మతపోకడలు నచ్చేవి కావు. అందుకే వాటికి దూరంగా ఉండే వాడు. అలాగే బ్రాహ్మణ సాంప్రదాయం లో ఉన్న ఒడుగు ను తిరస్కరించారు. తర్వాత బాగేవాడి ప్రాంతాన్ని వదిలి పెట్టి దగ్గర్లో ఉన్న కూడలి సంగమకు చేరుకొని అక్కడి ఈశాన్య గురువుగారి దగ్గర చేరారు. ఆతర్వాత బిజ్జల మహారాజు ఆస్థానంలో ఆర్ధిక విభాగంలో చేరారు. వీరి యొక్క కష్టం, తెలివిని మహారాజు గారు గుర్తించారు. వీరు బలదేవ అనే మంత్రిగారి పుత్రికను వివాహం చేకున్నారు. తరచుగా ఈయన చుట్టూ శివ భక్తులు చేరేవారు. ఈయన మామగారైన బలదేవులు బిజ్జల మహారాజు ఆస్థానంలో మంత్రివర్యులు. బసన్నను బిజ్జల వారి ఆస్థానంలో చేర్చుకొనుటకు రకరకాల సిద్ధాంతాలను ఆపాదించారు.

 

మామ బలదేవుడు అనారోగ్యంతో మంచాన పడ్డప్పుడు అతని బాధ్యతలన్ని బసవన్నకు ఇవ్వడం జరిగింది. అక్కడ వున్న నిధుల ఆచూకీని కొన్ని నిఘాఢమైన శాసనాల ఆధారాలతో ఉనికిని వెలికి తీసేవారు. ఇది బిజ్జల మహారాజుకు ఎంతో సంతోషాన్ని కలిగించేది. బసవ పురాణం ప్రకారం బసవన్న మంత్రిగా చేరిన తరువాత శైవ భక్తులకు బహుమతులు, బహుమానాలు పంచేవారు. ఇది నచ్చని కొందరు, మహారాజుకు ఫిర్యాదు చేస్తే మహారాజు ఫిర్యాదు చేసిన భక్తులని శిక్షించారు. కళ్యాణి ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులు విపరీత సాంప్రదాయాలతో అసంతృప్తి చెంది అక్కడ కులరహిత సమాజాన్ని ప్రొత్సహిస్తారు.

 

అనుభవ మంటప అనే మత వేధికను ప్రారంభించి అక్కడ స్వచ్ఛమైన మత చర్యలకు తోవ కల్పించారు. బసవన్న గారు వేదిక నుండే రోజురోజుకు పెరుగు తున్న శైవ భక్తులకు తన వచనాలను వినిపించే వారు. కాలంలోనే కళ్యాణి ప్రాంతంలో ఈయన నిమ్న జాతి యువకునికి బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయిని ఇచ్చి కులాంతర వివాహం జరిపించారు. ఇది ప్రాంతం లోని ఆచారాలు పాటించే బ్రాహ్మణులకు నచ్చలేదు. దీనితో వారు బిజ్జల మహారాజు -II కు ఫిర్యాదు చేసి వారి ఇరువురిని శిక్షించవలసిందిగా కోరారు. అప్పుడు మహారాజు హరలయ్య మరియు మధువయ్య పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తండ్రులను పిలిపించి మరణ దండన విధించారు. ధుచర్య బసవన్న అనుచరులకు విపరీత మైన ఆగ్రహం తెప్పించింది. ఇలా అనుచరులు అసంతృప్తి చెందడంతో వారిలో కోపజ్వాలలను రగిలించడం మంచిది కాదని భావించి తిరిగి కూడలి సంగమకు చేరుకున్నారు.  

  ముందు పేజి

తర్వాతి పేజి


 































back       began       home       next                         
 line
address