కన్నడ రచనలు మరియు నాణాలు:

హంపిని పాలించిన వారిలో విజయనగర రాజులే కాదు, ఇది కదంబ, బాదామి చాళుక్యుల, హొయ్సళ, కాలచూరులు మరియు యాదవుల చేత కూడా పరిపాలించబడింది. క్రీ..1163 కాలపు శిలా శాసనాలను బట్టి "మహాధన" అనే మత పరమైన సమర్పణలు హంపి విరూపాక్ష స్వామి సమక్షంలో కాలచూరుల రాజు బిజ్జల వారు చేశారు.

 

నాణాల ద్రవ్యము:

దక్షిణ కాలచూరులు నాణాల పై కన్నడ లిపిని ముద్రించారు. నాణాలను అంతర్జాలంలో కూడా పొందుపరచాము. వీటిలో కాలచూరులకు చెందిన బర్మా భూపాల (క్రీ. .1187-1188) కాలం నాటి నాణాలను చూడవచ్చు.

 

గజశారదుల నాణాలు:

వీటిని బంగారు లేదా రాగి లోహాలతో తయారు చేశారు. వీటిమీద కూర్చొని ఉన్న దేవత చిత్రం అలాగే వీటిని ముద్రించిన రాజు వారి పేరు శ్రీమాత తో మొదలై దేవత తో పూర్తి అయ్యే పేరు ముద్రించ బడింది.

 

ఆనాడు సంఘంలో వచ్చిన వివిధ రకాల మత పిచ్చి తొలగించి ఒక సాంఘీక విధానాన్ని ఏర్పాటు చేయడానికి వీరశైవ ఉధ్యమం ఆరంభ మైంది. ఉద్యమం ఐదుగురు ఋషులైన రేణుక, దారిత, ఏకోరామ, పండితారాధ్య మరియు విశ్వరాద్యుల చేత ప్రారంభించబడినదని తప్పుగా ప్రచారం చేశారు. మధ్య కాలంలో జరిగిన పరిశోధనలు రేణుకాచార్య అనే మత పెద్ద లేనట్లు తేల్చింది. కొంత మంది స్వార్థ జంగములు రేవణ సిద్ధ మతాచార్యులనుండి రేణుకాచార్యుణ్ణి పుట్టించారు. రేవణ సిద్ధ బసవన్న కు వయసులో పెద్దవారు. బసవన్న బిజ్జల మహారాజు కాలంలో ప్రధాన మంత్రిగా ఉండేవారు. బసవన్ననే ఒక కొత్త మతమైనా లింగాయత్ మతాన్ని స్థాపించారు.

 

  ముందు పేజి

తర్వాతి పేజి


 




















back       began       home       next                         
 line
address