కాలచూరి (సంస్కృతం, కన్నడ, తెలుగు) పేరుతో రెండు ప్రాంతాలలో 10,12వ శతాబ్దంలో రాజ్యపాలన జరిగింది. ఒకటి మధ్య భారతదేశం (పక్షిమ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాలు) దీన్ని చెడి లేదా హైహయ (హేహేయ) (ఉత్తర రాజ్యం) అని పిలిచేవారు. రెండవది దక్షిణ కాలచూరి, వీరు కర్ణాటక, ఆంధ్రా ప్రాంతాలను పాలించారు. వీరు సమయం మరియు ప్రాంతాలను సమానంగా ఉంచుతారు. వీరికి వంశపారంపర్య పేరు మరియు సాధారణ వంశపారంపర్యాలపై నమ్మకం ఉండేది.  వీటి కన్నా మొదటి కాలచూర్ల కుటుంబం (క్రీ.శ.550 - 620) ఉత్తర మహారాష్ట్ర, మాల్వా మరియు పడమటి డెక్కన్ ప్రాంతాలను పాలించిరి. వీరి రాజధాని మాహిస్మతి, ఇది నర్మదా నదీ పరివాహ ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ ముగ్గురు ముఖ్యులు కృష్ణ రాజు, శంకరగన, బూదరాజు వీరు నాణాలను, రచనలను ఈ ప్రాంతాలలో అందరికి అందుబాటులోకి తెచ్చారు.

 

దక్షిణ కాలచూర్ల రాజ్యం (కన్నడ / తెలుగు) (1130 నుండి 1184) దక్షిణ ప్రాంతంలో కర్ణాటక నుంచి మొదలుకొని మహారాష్ట్ర వరకు పాలించిరి. వీరు క్రీ.శ.1156 నుండి 1181 వరకు కొనసాగిరి. వీరు మధ్య ప్రదేశ్ లోని కాలింజర్ మరియు దహల ప్రాంతాలను పాలించిన కృష్ణ వారి మూలాలు గుర్తించారు. ఈ రాజ్యపు వైస్రాయ్ బిజ్జుల వారు కర్ణాటక ప్రాంతాన అధికారాన్ని స్థాపించిరి. ఈయన చాళుక్యుల రాజు తైల-3, నుండి అధికారాన్ని పొందెను. ఈ బిజ్జల వారి వారసత్వమైన సోమేశ్వర, సంగములకు వారి తర్వాత అధికారం వచ్చింది. కానీ క్రీ.శ.1181 తర్వాత మెల్లగా చాళుక్యుల పాలన పునరుద్ధరించిరి. వీరిది తక్కువ కాలమైనా చెప్పుకోదగ్గది గా నిలిచింది. ఈ సమయంలోనే లింగాయత్, విశ్వ లింగాయత్ అనే క్రొత్త జాతి మొదలైంది.

మధ్య భారతదేశ వాసులు:

పి.బి. దేశాయ్ లాంటి చరిత్రకారులు కాలచూర్ల ఉనికిని మధ్య భారతదేశంలో ఉన్నట్టు కచ్చితంగా వెల్లడిస్తున్నారు. బాదామి చాళుక్య పరిపాలనకు ముందు వీరు గుజరాత్, మాల్వా, కొంకణ్ మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను కలిపి ఒక పెద్ద సామ్రాజ్యంగా ఏర్పడ్డారు. వీరు చాళుక్యుల చేతిలో చిక్కిన తర్వాత చాలాకామ్ అజ్ఞాతంలో ఉన్నారు. నాటి దస్స్రాల ప్రకారం ఈ రాజ్యాన్ని సోమ ఏర్పర్చిరి. ఈయన కొంత కాలం పాటు పెద్ద గడ్డం, మీసాలు పెంచుకొని తన ఉనికిని అజ్ఞాతంలో ఉంచుకొని పరశురాముడి నుండి కాపాడుకున్నాడు. దీని తర్వాత వీరు కాలచూర్లుగా పేరొందిరి. కల్లి అనగా పెద్ద మీసాలు మరియు  చూరి అనగా పదునైన కత్తి.

  ముందు పేజి

తర్వాతి పేజి


 




























back       began       home       next                         
 line
address