వీరులు (లెజెండ్స్) :

నాటి మహానుభావులు నిర్వచించిన కాలచూరులని కతాచూరులని కూడా పిలువబడ్డారు. (పదునైన కత్తి యొక్క ఆకారం) కల్లి మరియు చూరి అర్థాల ద్వారా ఏర్పడింది. వీరిని కళాంజరపురవరదీశ్వర (కళాంజర దేవులు) లేదా హైహయ (హేహేయ) అని కూడా పిలువబడ్డారు. మౌంట్ కళాంజర ఉత్తర భారతదేశ ప్రాంతమైన ఇండస్ లోయ ప్రాంతం.

 

హయ అనగా గుర్రం, కాబట్టి హాహ్య అనేపేరు దీని పేరు మీదుగానే ఏర్పడింది. ఇంకొన్ని వివరణలు ఏంటంటే.

 

యదు మహారాజుకు మునిమనుమలైన, చంద్రమండల జాతికి చెందిన వీరికి సైథియాన్ మూలాలు ఆపాదించబడ్డాయి. విష్ణు పురాణం వారిని యదు జాతికి చెందిన హైహాయీ యొక్క వారసులుగా సూచిస్తుంది,  కానీ వీరు సరిహద్దు ప్రాంతాల తెగలకు జతకట్టనున్నారు. వాయు మరియు ఇతర పురాణాల్లో, ఐదు గొప్ప విభాగాల తెగలైనా  తలజంఘాలు, వీతిహోత్రులు, అవంతులు, తుండికెరులు, జాత లేదా సుజాత లు గా పిలువబడతాయి.

 

వారు హరిష్ చంద్ర రాజు యొక్క వంశస్థుడైన బాహు లేదా బహుక్యులను జయించారు మరియు బాహు  కుమారుడు అయిన సగర రాజు సహకారంతో అనేక ఇతర బార్బేరియన్ తెగల పై కూడా విజయం  సాధించారు.

 

మహాభారతం ప్రకారం, వారు మను వారసులైన శర్యాతి సంతానం. వారు  దొఅబ్ పై దాడి చేసి కాశీ (బెనారస్) పట్టణాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి వరకు ఈ నగరం దివో దాస మహారాజు రక్షణ లో ఉండింది. కానీ ఈ మహా రాజు మనవడు ప్రతర్దన హైహయలను నాశనం చేసాడు. అలాగే కాశీ నగరాన్ని తిరిగి పొందాడు. కార్తవీర్యార్జున, వేయి చేతులు కల్గిన హైహయల మహారాజు. పరశురాముడి చేతిలో ఓడించబడ్డాడు, అలాగే పరశురాముడు ఇతని చేతులను కత్తిరించాడు. వింధ్య పర్వతాలు ఈ గిరిజనుల నివాసంగా ఉన్నాయి;  మరియు కోలోనెల్ లోడ్ ప్రకారం, హైహయనుల యొక్క తెగ ఇప్పటికి భాగేల్ఖండ్ లోని ఎంతో ఎత్తైన సోహాగ్ పూర్ లోయలో ఉన్నారు. వీరు, వారి యొక్క వారసత్వ సంపద మరియు ధైర్య సాహసాలు గుర్తెరిగి ఉన్నారు. ఇప్పటికి వారు తమ శౌర్య పరాక్రమ ప్రదర్శనలను జరుపుకొంటారు. వీరికి వారి పురాతన వంశం గురించి బాగా తెలుసు.

 

  ముందు పేజి

తర్వాతి పేజి


 




































back       began       home       next                         
 line
address