మొదటి రాజ్య పాలన:

కాలచూరుల కాలం నాటి దేవాలయాలు అమరుకంటక్ ప్రాంతంలో చూడవచ్చు. వీటిని మహారాజ కర్ణదేవ (క్రీ..1042-1072) లో నిర్మించారు. కాలచూరి పాలించు కుటుంబాలను  త్రిపురి, గోరఖ్ పూర్, రత్నపూర్, రాజ్ పూర్ (తూర్పు గుజరాత్) ప్రాంతాలలో చరిత్రకారులు గుర్తించారు. ఇవి మధ్య భారతదేశం యొక్క ప్రాంతాలు. వీరు జబల్పూర్ దగ్గరలోని త్రిపురి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని పాలించారు. కోకల్ల -1 రాజ్యాన్ని ఏర్పరచడంలో ముఖ్యులు, మొదటివారు. చేడి రాజులు కన్నౌజ్, మాల్వా, చాళుక్యులు మరియు  రాష్ట్రకూటులను ఎదుర్కోవలసి. వచ్చింది. వీరికి వీరి రాజ్యన్ని, పాలా మరియు కళింగ రాజులనుండి కూడా కాపాడు కోవాల్సి వచ్చింది. కాలచూరులలో చెప్పకోదగ్గ ముఖ్యలలో  "గంగేయ దేవ" ఒకరు. ఈయన చేడి రాజులను ఉత్తర భారతదేశంలో ఒక గొప్పశక్తిగా ఎదిగించండం లో ముఖ్యపాత్ర వహించారు. ఈయన తరువాత ఇతని కుమారులు "కరణ్ దేవ" పాలించారు.

 

రెండవ రాజ్యపాలన ; 

గుర్జర - ప్రతిహార పతనం తర్వాత, లక్ష్మ్ కర్ణ (1041-1072) కాలచూర్ల వంశంలో ఒకరు, రాజ్యపాలన చేపట్టి  నేటి గోరఖ్ పూర్ ప్రాంతాన్నంతటిని తన ఆధీనంలోకి  తెచ్చుకున్నారు. కాని ఈయన సంతానమైన యష్ కర్ణ (1073-1129) చెప్పుకోదగ్గ సామర్థ్యాన్ని కనబర్చలేకపోయారు. కాలచూరులకు చెందిన ఇంకొక పాలకుడు సోద దేవ గోరఖ్ పూర్ ప్రాంతంలో వారి స్వతంత్రాన్ని చాటారని అక్కడి  శిలాశాసనాలు తెలుపుతున్నాయి. అదే కాలంలో కలాచూరి పాలనను ప్రాంతంలో కన్నౌజ్ యొక్క గహద్వల చేత భర్తీ చేశారు. కొన్ని శిలాశాసనాల ఆధారంగా గోవింద్ చంద్ర (1114-1154) గహద్వల రాజ్యాన్ని గోరఖ్ పూర్ ప్రాంతాన్ని కలుపుకొని బీహార్ వరకు వ్యాప్తి చెందించారు. మగ్ దిహ (గగ్ ), బాన్స్ గావ్ ప్రాంతంలోని దురియాపర్ ప్రాంతాలలో శాసనాలు గోవింద్ చంద్ర  కుటుంబాల గురించి మరియు వారి సేవ కార్యక్రమాల గురించి తెల్పుతాయి. ఇక్కడి రాతి, ఇటుక కట్టడాలు, రాతి కట్టడాలతో నిర్మించిన బావులు వారి యొక్క పరిపాలనా తీరును తెల్పతాయి. అయితే శిహాబ్-ఉద్దీన్ ఝరి చేతిలో 1194 లో గోవింద్ చంద్ర గారి మనవడు జయచంద్ర (1170-1194) ఓటమి పాలయ్యాడు. దీంతో గహద్వలా వారి పెత్తనం పతనమైంది . అప్పుడు ప్రాంతంలో సర్నెట్, దొంన్వెర్, దొంవర్, కౌశిక్ రాజ్ పుత్ మరియు బార్ పెత్తనం వెలసింది.

 

 

  ముందు పేజి

తర్వాతి పేజి


 





























back       began       home       next                         
 line
address