synopsis

బిజ్జుల వారి కుటుంబం గురించి సంక్షిప్తంగా :

కాలచూరి (సంస్కృతం, తెలుగు, కన్నడ) ఈ పేరుతో రెండు ప్రాంతాల రాజ్యాలు పరిపాలించబడ్డాయి. వీరి తదనంతరం వీరికి చెందిన రాజులు ఆరవ శతాబ్దం నుంచి పాదనాల్గొవ శతాబ్దం వరకు మధ్య భారతదేశాన్ని పాలించారు. ఈ ప్రాంతాలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లు ఉన్నాయి. అలాగే వీరిని చెడి లేదా హాయ్హయ / హేహేయ అని పిలిచారు (ఉత్తర రాజ్యం). ఉత్తర కాలచూరి కుటుంబం పురాతన భారతదేశపు త్రిపురి / తివార్ (ప్రస్తుతం జబల్పూర్ యొక్క ఔట్సర్స్)  ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని వారు ప్రధానంగా మాల్వా, గుజరాత్ ఛత్తీస్గఢ్, ఒరిస్సా మరియు మహారాష్ట్రల ను పాలించారు. వీరు ఆరవ  శతాబ్దం లో పుట్టిన జైన మతాన్ని అవలంభించారు. దీనిని పదకొండవ శతాబ్దంలో గణనీయంగా విస్తరించారు, మరియు పాదనాల్గొవ శతాబ్దంలో ఈ మతం తగ్గుముఖం పట్టింది.

 

దక్షిణ కాలచూరిలు వారి రాజ్యంలో జైనులు మరియు శైవులను ప్రోత్సహిస్తూ (రక్షిస్తూ) పాలించారు. వీరు కర్ణాటక / ఆంధ్రా / తమిళనాడు / కేరళ ప్రాంతాలను పాలించారు. వారు ఒకే కాలపు పేరు మరియు ఉత్తర కలాచూరిస్ యొక్క సాధారణ సంతతికి చెందినవారు, వీరు మగళ్ వేద / మంగళ్ వేది/ మంగళ్ వేద ప్రాంతాన్ని. రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వారు తమని తాము మధ్య భారత భూభాగం అని అర్థం వచ్చే "కలంజరపురవరాధీశ్వర" అని పిలుచుకున్నారు. వారి చిహ్నం సువర్ణ వృషభం లేదా బంగారు ఎద్దు. చరిత్ర కారుల ఊహ ప్రకారం ఈ కాలచూర్లు  దక్షిణాన కళ్యాణి యొక్క చాళుక్యుల మరియు రాష్ట్రకూటులతో వివాహ సంబంధాలు ఏర్పరుచుకున్నారు. వీరు త్రిపురి, గోరఖ్ పూర్, రత్నాపూర్, రాజ్ పూర్ వంటి ప్రదేశాల నుండి వారి రాజ్యాలను పరిపాలించారు.

 

తర్వాతి తరాల కాలచూరులు మధ్యప్రదేశ్ ప్రాంతంలో చూడవచ్చు. వారు ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో వ్యాపించి ఉండిరి. ఈ కాలచూరులు జైన మతాన్ని అవలంబించారు. వీరు జైనమతాన్ని, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాలకు చేరిన తరువాత బాగా అభివృద్ధి చెందించారు. కాలచూరుల కాలంలో జనమతం బాగా అభివృద్ధి చెందినట్లు మనకు తెలుస్తుంది. ఈ వంశానికి చెందిన రాజు విజ్జల-బిజ్జల/ బిజ్జలదేవుడు మంచి మతపరమైన సహనాన్ని కల్గి ఉండి "మహాభుజబలచక్రవర్తి" గా అలాగే జైనులకు కౌశికుడుగా పేరుపొందాడు. .కాలాచూరి కాలంలోని మంత్రి అయినా రేచమయ్య, తీరుకారులైన శాంతినాధ్ విగ్రహాన్ని శ్రావణబెళగొళలో స్థాపించారు. కళ్యాణి ప్రాంత రాజు బిజ్జల కాలచూరుడు తన ఆర్ధిక మంత్రి బసవ రాజు గారి సహాయంతో వీరశైవ మతాన్ని కూడా పెంపొందించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ప్రాంతాల్లో ఈ వీరశైవ మతం పాటించబడ్డది. (ప్రాచుర్యం పొందింది). బిజ్జల రాజ్యంలోని సైనిక దళాలు వైష్ణవ మతాన్ని అవలంభించేవారు. ఇది కొంత కాలానికి శైవుల మరియు వైష్ణవుల మధ్య ఘర్షణలకు దారి తీసింది. బిజ్జుల వారి కాలంలో మరియు వారి తర్వాతి తరాల కాలంలో ఎన్నో వివిధ వైష్ణవ ఆలయాలను నిర్మించారు. అవే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతంలోని కేశవస్వామి దేవాలయాలు.


 



































back       began       home       next                         
 line
address